నిండు పున్నమి నాడు నా వేంకటేశుడురా - Nindu Punnami Naadu Naa Venkateshudura Lyrics

Kantharaj Kabali
0




ఓం నమో వేంకటేశాయ

పల్లవి:

నిండు పున్నమి నాడు నా వేంకటేశుడురా
పండు వెన్నెల దారిలో పల్లకేగెనురా

పూలకొండల చాటున నా వేంకటేశుడురా 
చిన్ని చిన్ని చిరునవ్వుతో ఊరేగేనురా

మాడవీధుల జాతరే వైభవోత్సమురా.... (2)

ఏడుకొండలు ఏకమై చూడ వచ్చెనురా

( నిండు )


చరణం1

గజరాజులు ముందర దారులు తీయంగా   
దారులు తీయంగా

గోవింద ఆంటూ జనం బారులు తీరంగా
బారులు తీరంగా

గరుడ వాహనం స్వామికి ఆసనమేయంగా
ఆసనమేయంగా

పండితులు పాశురాలు చదువుతూ నడవంగా
 చదువుతు నడవంగా

కర్పూర హారతులు భక్తులు ఇవ్వంగా....(2)

స్వామి అందరిని దీవిస్తూ మెల్లగా కదలంగా        

( నిండు )

చరణం2

అవతారాలెన్నైనా అండగా ఉంటాడురా
అండగా ఉంటాడురా

శరణుకోరు భక్తుల మది నిండుగ వస్తాడురా
నిండుగ వస్తాడురా

ఆపద మ్రొక్కులవాడని పేరే పెట్టామురా.
పేరే పెట్టామురా

ఆనందం ఇవ్వమని గోవిందన్నమురా
గోవిందన్నమురా

పిల్లా పాపలము మేము సల్లగా జూడఁటూ  (2)

స్వామి కల్లా కపటము లేని భక్తుల దీవిస్తూ   
     
 ( నిండు )

~~~*~~~

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top