రాగం: మధ్యమావతి
తాళం: త్రిశ్ర
పల్లవి
వేంకటేశుడు మా తిరుమలేశుడు
గోవిందుడు కాదా మన ఆత్మరాముడు
శ్రీ నివాసుడు మా హృదయవాసుడు
సిరి మంతుడు కాదా మా స్థిరనివాసుడు
ఎన్నిసార్లు మ్రొక్కినా తనివి తీరదు....
ఇంకెన్ని జన్మలెత్తినా భక్తి చాలదు....
ఎన్నిమెట్లు ఎక్కినా అలసట్టుండదు...
నిను ఎన్నిసార్లు చూసినా.....ఎదురు చూపు ఆగదు
!!వేంకటేశుడు!!
చరణం1:
నరులకు సురులకు నీవే దైవమంటివా....
కొలిచిన భక్తుల మనసున కొలువు వుంటివా....
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
గోవిందుడు అంటే చాలు మురిసిపోదువా.....
గడచిన జన్మల పాపం తొలిచి పోదువా....
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
ఎంత భాగ్యమో నీ ఏడుకొండలను చూడ....
జన్మ ధన్యమో నీ నామ స్మరణలో మునుగా.....
!!వేంకటేశుడు!!
చరణం2:
లాలన పాలన నీకే ఇష్టమంటివి....
యశోదమ్మకు ముద్దుల కృష్ణుడైతివి...
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
ధర్మం నిలుపుటకు నీవే రాముడైతివి....
కౌసల్యమ్మకి బంగరు కొండవైతివి....
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
ఎంత పుణ్యమో నీ పేరుపెట్టి మే పిలువా....
జన్మ ధన్యమో నీ నామ స్మరణలో మునుగా....
!!వేంకటేశుడు!!
చరణం3:
కలియుగమంతా నిలబడి అలసిపోయినా....
అలమేలు తల్లి నీ పాద సేవ సేయునా....
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
బ్రహ్మాండం నీ చేతిలో అణువంతైనా....
కొడుకు తిన్నాడో లేదోని వకుళమ్మ అడిగెనా....
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
ఎంత భాగ్యమో నీ దర్శనంబు మాకివ్వగ...
జన్మధన్యమో నీ నామ స్మరణలో మునుగా...
!!వేంకటేశుడు!!
~~~*~~~