Annamacharya
ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా - 3
ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా - 2
ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా
ఓం నమో నారాయణాయ - 4
మమ్మేలుకొనగా నువు మేలుకో స్వామి, ఇది నిత్యము మా కొసగిన సేవా భాగ్యము
కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ మణ్హికం
పువ్వులన్ని మురిసి విరిసె నీ మాలగా తరియించగా
తోమాల సేవతో పులకించగా
తోమాల సేవ -2
ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా
సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కను విందులు, అష్టదళ పద్మ అష్టొత్తర శతావళులు
అల అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున
నీవు గనక దీవించిన స్వామీ నీ పరివారము
ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు, తిరుప్పావడకు ముందు నమర్జోనితాలు
గోవిందా హరి
గోపాలా హరి
గోవింద గోవింద గోవింద గోవింద గోపాల హరి
గోవిందా హరి
గోపాలా హరి
గోవింద గోవింద గోవింద గోవింద గోపాల హరి
సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రిపాదాలు నిజ పాద దర్శనము మహద్భాగ్యము - 2
పరిమళ భరితము ఆకాశ తీర్ధము
పరవశమిచ్చే క్షీరాభిషేకము
ఆ పుణ్య జలములు శిరమున పడిన చరితార్ధమే కదా ఈ జన్మ
జొ అచ్యుతానంద
జొ జొ ముకుందా
కలికరముల నిలచి అలసిపొతిని ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి
పసిడి ఉయ్యాలలో
ఈ పట్టు పరుపుపై కాసేపు కాసేపు కాసేపు పవళించర భోగ శ్రీనివాసుడవై
జొ అచ్యుతానంద జొ జొ ముకుంద 3
గోవింద గోవింద గోవింద గోవింద -4
ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా - 2
ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా - 2
ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా
~~~*~~~
🔱OM SAKTHI 🔱