Varalakshmi Devi Ravamma Lyrics in Telugu


Varalakshmi Devi Ravamma Lyrics in Telugu

Lakshmi Devotional Song Lyrics


వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ

మా ఇంటి వేల్పు నీవమ్మ , నా కల్పవల్లి రావమ్మ

మనసార దీవెనీవమ్మ,  మమ్మేలు తల్లి రావమ్మా ॥  2 ॥


వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ


చరణం : 1

అతివల మనసునెరిగి , ఐదవ తనము నోసిగి

ముత్తైదు భాగ్యమిచ్చే , మురిపాల నోము నోచి

వరలక్ష్మి దేవి వ్రతము, వరముల నొసగే తరుణం  ॥ 2॥


వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ 


చరణం : 2

 భక్తి వేల్లువలలోన, భావన లహరివి నీవు

మంగళ రూపిణి రావే, మా బంగారు తల్లి నీవే

నీ పాద సేవ భాగ్యముగా, తరియించు మేము ఎల్లపుడూ   ॥ 2 ॥


వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ


చరణం: 3

వరలక్ష్మి దేవి సిరి జల్లు, మా ఇంట నిలిచి వర్ధిల్లు,

మమ్మేలు తల్లి హరివిల్లు, నీ వ్రతముల విరిజల్లు

నీ పాద సేవే పదివేలు , మా ఇంట అలరు మురిపాలు  ॥  2॥


వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ 


చరణం: 4

అందాల దేవి నీవే, శింగారి సిరుల పంట,

వరలక్ష్మి నోము నోచి, భాగ్యాలు పొందు నంట

వరముల నొసగే తల్లి, పూచినా పున్నాగ  మల్లి  ॥ 2॥ 


వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ

మా ఇంటి వేల్పు నీవమ్మ , నా కల్పవల్లి రావమ్మ

మనసార దీవెనీవమ్మ,  మమ్మేలు తల్లి రావమ్మా ॥  2 ॥


వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ 

వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


About Kantharaj Kabali

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Shiva Song Lyrics

Murugan Devotional Songs Lyrics

.

Lakshmi Devotional Songs Lyrics

.