తల్లిరో సరస్వతి - Talliro Saraswathi

Kantharaj Kabali
0

Saraswathi Devotional Song Lyrics

సరస్వతి భక్తి గీతాలు

రచన -శ్రీ రాయప్రోలు సుబ్బారావు

సంగీతము-శ్రీ పాలగుమ్మి విశ్వనాథం


తల్లిరో సరస్వతి నిను 

ఉల్లములలో నిలిపి కొలుతుము


శబ్దములు ముత్యాల వలె నీ

పాలవెల్లువ లోన తేలెను

గీతమాయెను మీది మీగడ

చేతనము చిగురించగా

||తల్లిరో||


అక్షరములై పుస్తకములో

గానమై కలకంఠి ముఖమున

తానమాలై వీణ తంత్రుల

వెలసె నీ తొలి నుడువులే

||తల్లిరో||


పాలనీళ్ళను వేరుపరచే

హంసపై స్వర హారమల్లుచు

వేదవీధుల మీద తిరిగే 

భగవతీ శ్రీ భారతీ

||తల్లిరో||


నీదు కిన్నెర వంటి కంఠము

నీదు సుశ్రుతి నొప్పు స్వరమును

హంస  నేర్పును చిలుక పలుకులు

మాకొసంగుము శారదా

||తల్లిరో||


~~~ * ~~~

 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top