శ్రీలక్ష్మి పూజకు రారండి - Srilakshmi Pujaku Rarandi Lyrics

Kantharaj Kabali
0

Srilakshmi Devotional Song Lyrics

సిరులను గూర్చే శ్రీలక్ష్మి పూజకు రారండి

సిరి సంపదలొసగే ధనలక్ష్మి కి సేవలు చేయండి

కొలిచిన వారికి కన్నతల్లిగా కన్నతల్లిగా

నమ్మిన భక్తుల కల్పవల్లిగా కల్పవల్లి గా

దయతో బ్రోచే కరుణా సాగరి

పావన పాదముల శరణం అనుచూ

శ్రీలక్ష్మి పూజకు రారండి

సిరి సంపదలొసగే ధనలక్ష్మి కి సేవలు చేయండి

అష్టకష్టములు బాపేతల్లి బాపేతల్లి

అష్టైశ్వర్యము లొసగే తల్లి ఒసగే తల్లి

అష్టలక్ష్మి గా అవని లో వెలిగే

విష్ణు మనోహరి కరుణా సాగరి

శ్రీలక్ష్మి పూజకు రారండి

సిరి సంపదలొసగే ధనలక్ష్మి కి సేవలు చేయండి

సౌభాగ్యములను గూర్చే తల్లి సౌభాగ్యలక్ష్మి

ధన కనకాదుల నొసగే తల్లి శ్రీ ధనలక్ష్మి

శ్రీ ధనలక్ష్మీ నోమును నోచి

వేడిన వారల బ్రోచే జనని

శ్రీలక్ష్మి పూజకు రారండి

సిరి సంపదలొసగే ధనలక్ష్మి కి సేవలు చేయండి

 శ్రీ ధనలక్ష్మి ని కొలిచిన ఇంట

స్థిరముగ అలరును  సిరిసంపదలు||శ్రీ||

శ్రీ ధనలక్ష్మి ని కొలిచే భాగ్యం

ఎన్నో జన్మల నోముల ఫలము

శ్రీలక్ష్మి పూజకు రారండి

సిరి సంపదలొసగే ధనలక్ష్మి కి సేవలు చేయండి

దారిద్ర్యము ను ధ్వంసము చేసి

వైభోగములను గూర్చే తల్లి||దారిద్ర్యము||

శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెన

ఆశ్రిత కోటికి శుభమగు రక్షణ

శ్రీలక్ష్మి పూజకు రారండి

సిరి సంపదలొసగే ధనలక్ష్మి కి సేవలు చేయండి

ఆశ్రిత కోటికి అమృత మయము

కుబేర లక్ష్మి పావన చరితం||ఆశ్రిత||

దయగనవమ్మా వైభోగలక్ష్మి

మా సర్వస్వం నీవే ననుచూ

శ్రీలక్ష్మి పూజకు రారండి

సిరి సంపదలొసగే ధనలక్ష్మి కి సేవలు చేయండి

~~~ * ~~~

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top