దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..
ఇల్లలికి ముగ్గు పెట్టి నాగన్న
ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెలా వాసన తో నాగన్న
కోలాట మాడి పోరా నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..
బామా లంత చేరి నాగన్న
బావి నీళ్ల కెలితే నాగన్న
బావి లో వున్నావ నాగన్న
బాల నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..
పిల్లా లంతా చేరి నాగన్న
పుల్లా లేరా బొతే నాగన్న
పుల్ల లో వున్నావ నాగన్న
పిల్లా నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..
స్వామూలంత చేరి నాగన్న
రెవ్వు నీళ్ల కేళితే నాగన్న
రెవ్వులో వున్నావ నాగన్న
బాల నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2| ..
అటు కొండ ఇటు కొండ నాగన్న
నడుమ నాగుల కొండ నాగన్న
కొండ లో వున్నవా నాగన్న
కోడే నాగు వాయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|.
~~~~~~~