నిత్య పూజలివిగో - Nithya PoojaIivigo Lyrics

Kantharaj Kabali
0

Lyrics -Annamacharya

Singers -Malladi Brothers

 

నిత్య పూజలివిగో నెరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి 

||నిత్య పూజలివిగో||


తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట

కనుగొన చూపులే ఘన దీపములట 

తన లోపలి అంతర్యామికిని

 ||నిత్య పూజలివిగో||


పలుకే మంత్రమట పాదయిన నాలుకే కలకల మను పిడి ఘంటయట

నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకు

 ||నిత్య పూజలివిగో||


గమన చేష్టలే అంగరంగ గతియట

తమి గల జీవుడే దాసుడట

అమరిన ఊర్పులే ఆలవట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయునికి

||నిత్య పూజలివిగో||

~~~*~~~

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top