Jayalakshmi Varalakshmi Song Lyrics
Annamacharya Krithi
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా
పాలజలనిధిలోని పసనైన మీఁగడ
మేలిమి తామెరలోని మించువాసన
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా
చందురుతోడఁ బుట్టిన సంపదల మెఱుఁగవో
కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడునీడై
వుందానవు మాఇంటనే వుండవమ్మా
పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదముల చిగురుఁబోడి
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిధుల నిలిచేతల్లి నీవారమమ్మా
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Thanks for the lyrics.
ReplyDelete