జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి - Jayalakshmi Varalakshmi Lyrics in Telugu

Kantharaj Kabali
0


Jayalakshmi Varalakshmi Song Lyrics 

Annamacharya Krithi


జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి( బెరసితి వమ్మ


పాలజలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామెరలోని మించు వాసన
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ


చందురుతోడబుట్టిన సంపదల మెరగువో
కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడై
వుందానవు మా యింటనే వుండవమ్మా


పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదముల చిగురు బోడి
ఎదుట శ్రీవేంకటేశు నిల్లాలవై నీవు
నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top