వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
మల్లెలు మొల్లలు కొల్లలుగా తెచ్చి (x2)
తెల్లకలువలతొటీ దేవి పూజింతు (x2)
వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
క్షీరాబ్ది తనయ సింహాసనమిత్తు (x2)
పసుపు- కుంకుమనిచ్చి దేవీ దీవించు (x2)
వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
శుక్రవారపు లక్ష్మి సిరులీయవమ్మ (x2)
కోరి ధ్యానము చేయ చేరీ పూజింతు (x2)
వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
0 comments:
Post a Comment