Pancharatna Kriti
Raga - Varali
Thala - Aadhi
కన కన రుచిరా కనక వసన నిన్ను (కన) అ. దిన దినమును మనసున చనువున నిన్ను (కన) చ1. పాలు కారు మోమున శ్రీయపార మహిమ తనరు నిన్ను (కన) చ2. కల-కలమను ముఖ కళ కలిగిన సీత కులుకుచునోర కన్నులను జూచు నిన్ను (కన) చ3. బాలార్కాభ సు-చేల మణి-మయ మాలాలంకృత కంధర సరసిజాక్ష వర కపోల సు-రుచిర కిరీట ధర సంతతంబు మనసారగ (కన) చ4. సా-పత్ని మాతయౌ సురుచి-చే కర్ణ శూలమైన మాట వీనుల చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖింపగ లేదాయటు (కన) చ5. మృగ మద లలామ శుభ నిటిల వర జటాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమ తెల్ప సీత తెలిసి వలచి సొక్క లేదా ఆ రీతి నిన్ను (కన) చ6. సుఖాస్పద విముఖాంబు ధర పవన వి-దేహ మానస విహారాప్త సుర భూజ మానిత గుణాంక చిదానంద ఖగ తురంగ ధృత రథాంగ పరమ దయా-కర కరుణా రస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే (కన) చ7. కామించి ప్రేమ మీర కరముల నీదు పాద కమలముల పట్టుకొను వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శౌనక పురందర నగజా ధరజ ముఖ్యులు సాక్షి కాద సుందరేశ సుఖ కలశాంబుధి వాసాశ్రితులకే (కన) చ8. సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజ నుత ముఖ జిత కుముద హిత వరద ని