గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే
హరియచ్యుతాయని పాడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమపురుషాయని పలుకరే
సిరివరయనుచును చెలగరే జనులు
గోవింద గోవిందా ...
పాండవవరదా అని పాడరే
అండజవాహను కొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవునినే తలచరో జనులు
గోవింద గోవిందా ...
దేవుడు శ్రీవిభుడని తెలియరే
శోభలయనంతుని చూడరే
శ్రీవేంకటనాథుని చేరరే
పావనమైయెపుడును బతుకరే జనులు
గోవింద గోవిందా ...
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment