Seethadri Sikaharana Lyrics in Telugu

Seethadri Sikaharana


 Mangala Harathi

శీతాద్రి శిఖరాన్న  పగడాలు తాపించు
మా తల్లి నత్తునకు నీరాజనం
కె0పైన నీరాజనం 
భక్తి     కెo పైన నీరాజనం


యోగీ0ద్ర హృదయాన మ్రోగేటి మాతల్లి
బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం   
భక్తి పొంగారు నీరాజనం

నెలతాల్పు డెందాన  వలపు వీణలు మీటు
మాతల్లి    గాజులకు నీరాజనం
రాగాల   నీరాజనం  
భక్తి తాళాల   నీరాజనం

మనుజాళి హృదయాన తిమిరాలు తొలగి0చు
మాతల్లి    నవ్వులకు  నీరాజనం
ముత్యాల  నీరాజనం
భక్తి  నృత్యాల నీరాజనం


చెక్కిళ్ళ కాంతితో    కిక్కిరిసి  అలరారు
మా తల్లి ముంగురుల నీరాజనం
రతనాల నీరాజనం
భక్తి జతనాల నీరాజనం

పసి బిడ్డలను చేసి  -  ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం
భక్తి కనరాగ నీరాజనం

పగడాలు మరపించు ఇనబింబ మనిపించు
మాతల్లి కుoకుమకు భక్తి నీరాజనం
నిండిన నీరాజనం
భక్తి మెండైన నీరాజనం

ఏటి పిల్లల వోలె గాలి కల్లల నాడు
మాతల్లి కురులకు నీరాజనం
నీలాల నీరాజనం
భక్తి భావాల నీరాజనం  

జగదేక మోహిని  సర్వేశు గేహిని
మా తల్లి రూపులకు నీరాజనం
నిలువెత్తు   నీరాజనం
భక్తి నిలువెత్తు   నీరాజనం

~~~~~

About Kantharaj Kabali

    Blogger Comment
    Facebook Comment

Swami Ayyappa Devotional Songs

Murugan Devotional Songs

.

K.J.Yesudas Devotional Songs Lyrics

.